నందమూరి సుహాసిని మీద ప్రేమతో యన్టీఆర్ పోలింగ్ కేంద్రం వద్ద ఏం చేశాడంటే..!

Spread the love

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ బూతు లు వద్ద జనసంద్రంతో నిండిపోయింది. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ తరుపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారని వేచి చూసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు , అభిమానులకు నిరాశ మిగిలింది.

బంజారాహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ వద్దకు ఓటు హక్కును వినియోగించుకోడానికి కుటుంబంతో సహా హాజరైన ఎన్టీఆర్. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అని ఎవరో బలవంతం చేస్తే వచ్చేది కాదని తన అక్క నందమూరి సుహాసిని కి విజయం కలగాలని ఆశిస్తున్నా అన్నారు.

ప్రచారాలకు ఎన్టీఆర్ వస్తారని వేచి చూసిన కూకట్ పల్లి అభ్యర్థి నందమూరి సుహాసిని కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడువరకు తెలంగాణ లో మహాకూటమి కి కాని ప్రత్యేకంగా టీడీపీ కి కానీ తన సోదరి అయిన నందమూరి సుహాసిని కి కానీ ఓటు వేయమని కోరలేదు. ఈరోజు పోలింగ్ కేంద్రం వద్ద కి వచ్చిన ఎన్టీఆర్ తన మనసులోని మాటని బయటపెట్టాడు..

కూకట్ పల్లి అభ్యర్థి అయిన తన అక్క సుహాసిని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు..ఓట్ వేయడానికి అదే పోలింగ్ బూత్ వద్దకి వచ్చిన ఓటర్లు తారక్ తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు . తారక్ ఏమాత్రం ఇబ్బందిపడకుండా సహనంతో సెల్ఫీలు ఇచ్చారు .


Spread the love