రోబో 2.0 కి బాహుబలి అంత సీన్ లేదని తేల్చేసిన జనాలు

Spread the love

రజినీకాంత్ శంకర్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘రోబో 2.0′. ఈ సినిమా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రజిని కి దేశ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులున్నారో అందరికి తెలిసిందే..అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో ఎన్నో సంచలనాలకు తెరలేపింది..

ఆ తర్వాత శంకర్ చియాన్ విక్రమ్ తో ‘ఐ’  సినిమాని తెరకెక్కించాడు..ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది అప్పుడు శంకర్ చాలానే దెబ్బ తిన్నాడు..ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ రజిని తో రోబో ని తెరకెక్కించాడు..కాని ఈ సినిమాపై మరీ అంత అంచనాలు లేకపోవడం గమనార్హం..యంగ్ రెబెల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన బాహుబలి 2 పార్ట్ లకి మొత్తం 450 కోట్లు ఖర్చు అయ్యాయని నిర్మాతలు పేర్కొన్నారు.అలాగే ఈ రోబో కి కూడా 550 కోట్లు ఖర్చు పెట్టమని లైకా వాళ్ళు వెల్లడించారు.

అయితే ‘బాహుబలి’ కి ఉన్నత క్రేజ్ ఇప్పుడు ఈ రోబో సినిమాకి లేదనే చెప్పాలి..ఎంతో విలువలు కలిగి ఉన్న కెమెరాలని శంకర్ ఈ రోబో సినిమాలో ఉపయోగించాడు..అలాగే 4D టెక్నాలజీస్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాని రూపొందించాడు..కాని టీజర్ లో చూస్తే మరీ అంతగా అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది..అప్పటికి ఈ సినిమాపై ఎటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా చిత్ర బృందం కూడా చెయ్యట్లేదు..

ఇంకో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల అవుతున్న కూడా ఎటువంటి హంగామా లేకపోవడం తో ఎవ్వరు అంతగా ఈ సినిమా పై అంచనాలని పెట్టుకోవడం లేదు..బాలీవుడ్ స్టార్ ‘అక్షయ్ కుమార్’ ఉన్న కూడా అటు బాలీవుడ్ లో కోలీవుడ్ లో మన టాలీవుడ్ లో కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు.

ఇక ఈ రోబో మేనియా తక్కువే అని చెప్పాలి.. రజిని, శంకర్ మ్యూజిక్ మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి పని చేశారు కనుక వాళ్ళ ని దృష్టిలో పెట్టుకొని మొదటి వారం రోజు కలెక్షన్స్ ని రాబట్టేస్తుంది..చూద్దాం ఈ రోబో ఎన్ని రికార్డ్స్ ని క్రాస్ చేస్తుందో..


Spread the love