మోత్కుపల్లి నర్సింహులుకు గుండెపోటు ఆందోళన చెందుతున్న కార్యకర్తలు

Spread the love

తెలంగాణ ఎన్నికలు మొదలయ్యాయి అందరు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ లీడర్స్ గెలవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. పార్టీ తరపు నుండి పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసే అభ్యర్థులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు..

ఇదిలా ఉండగా తెలంగాణలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఉన్నఫలంగా ఆస్పత్రికి తరలించారు. మోత్కుపల్లికి గుండెపోటు రావంతో ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. మోత్కుపల్లి నర్సింహులు కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఛాతీ నొప్పితో మోత్కుపల్లి బాధపడుతున్నారని మోత్కుపల్లి కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన మొదట చంద్ర బాబు హయాం లోనే టీడీపీలో ఓ వెలుగు వెలిగారు.. ఆ తర్వాత ఆ పార్టీ ని వీడి బయటకి వచ్చారు. ఈ ఎన్నికల్లో మోత్కుపల్లి ఆలేరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

మోత్కుపల్లికి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సమయంలో ఇలా జరిగే సరికి కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.. ప్రస్తుతం మోత్కుపల్లికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరు దేవుడును ప్రార్దిస్తున్నామని ఆయన అభిమానులు తెలియజేశారు.. మోత్కుపల్లి ని పరీక్షించిన వైద్యులు తనకి ఏం ప్రమాదం లేదని చికిత్స జరుగుతుందని తెలిపారు..


Spread the love