‘వాట్ ఏ టాలెంట్’ అంటూ కూతురు డ్యాన్స్‌కు కాంప్లిమెంట్ ఇచ్చిన మహేష్

Spread the love

ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఎంత యాక్టీవ్ గా ఉంటుంది మనందరికీ తెలుసు. ఎప్పుడు సోషల్ మీడియా లో సితార ఫోటోలు కానీ సితార చేసే అల్లరి కానీ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అదే తరుణం లో ఇప్పుడు మరోసారి సితార చేసిన డాన్స్ వైరల్ అవుతుంది. స్వయంగా మహేష్ బాబు ‘నా సీతా పాప’ అంటూ ఈ వీడియో ను రిలీజ్ చేసాడు. అంతేకాదు వాట్ ఏ టాలెంట్ అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఇంకొక విశేషమేమిటంటే సితార డాన్స్ వేసిన పాట బాహుబలి చిత్రం లోని మురిపాల ముకుంద సాంగ్ . పాటను హమ్మింగ్ చేస్తూ చక్కని అభినయం తో ఈ పాటకు చాలా బాగా డాన్స్ వేసింది సితార. మహేష్ మాత్రమే కాదు ఈ పాటను సితార చేసిన డాన్స్ కు ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే. ఇక ఈ వీడియోకి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘వాట్ ఏ టాలెంట్’ అంటూ సేమ్ టు సేమ్ నాన్న మహేష్ లానే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


Spread the love