గుత్తా జ్వాలా ఓటు ని మాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం

Spread the love

ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరు అంటున్నారు కానీ అసలు ఓటు మాయమైతే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఓటు వేయడానికి వచ్చిన వారికీ నిరాశ మిగిలింది. ఓటర్ లిస్ట్ లోనుంచి తమ పేరును ఎలా తీసేస్తారని ఆగ్రహం తో పోలీస్ సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రాలపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబం లో ఉన్న వారికీ వేరే వేరే కేంద్రాలలో ఓటు వేయాల్సి వస్తుందని వాపోయారు. ఓట్లు మాయామవడంతో హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా అసహనం వ్యక్తం చేశారు..

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓటు ఓటర్ లిస్ట్ లో లేకపోవడం తో ఆశ్చర్యపోయారు. ఓటు మాయమవడం తో ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసారు. పలువురి ఓట్లు మాయమవడంతో తెలంగాణ ఎన్నికలపై అసహనం వ్యక్తం చేసారు. ఎంతో బాధ్యత గ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన గుత్తా జ్వాలా కు చేదు అనుభవం ఎదురైనది.

ఓటు హక్కుని వినియోగించని వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. కానీ ఓటు ను మాయం చేసిన వారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఎన్నికల అధికారులను సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నిస్తున్నారు.
ఓటు హక్కుని సద్వినినియోగం చేస్కోండి ప్రజాస్వామ్యం కాపాడండి అంటున్న వారి పై ఆగ్రహం వ్యక్తం చేసి గుత్తా జ్వాలా కోపానికి గురయ్యారు…


Spread the love