మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ తెలుగు సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం

Spread the love

“యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్” ఈ సినిమా పేరు వినగానే అర్ధం చేసుకోవచ్చు ఈ చిత్రం మన్మోహన్ సింగ్ గురించి అని. ఈ చిత్రం ఇప్పుడు ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ఉంది. మన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించాడు. 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితం లో ఏ సంఘటనలు జరిగాయో, సోనియా గాంధీ తనని ఎలా కీలు బొమ్మల చేసిందో ఈ సినిమాలో స్పష్టంగా తెలుస్తుంది.

కానీ ఈ సినిమాపై కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వహిస్తున్నారు.ఈ చిత్ర నిర్మాణానికి దర్శకుడు కానీ నిర్మాత కానీ మన్మోహన్ ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఈ సినిమా విడుదల ఆపివేయాలని కోర్ట్ లో కేసు కూడా వేశారు. కానీ ఎవరు దీనిపై చర్యలు తీసుకోలేదు. ఇంకా ఈ సినిమా ని పలు భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ని ఇప్పుడు తెలుగు లో కూడా విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ ని ఇప్పుడు తెలుగులో విడుదల చేశారు.

ప్రతి సన్నివేశాన్ని కళ్ళకి కట్టినట్టుగా ఎక్కడ ఏ సన్నివేశాల్లో దాపరికాలు లేకుండా నేరుగా సోనియా మీద టార్గెట్ చేసి మన్మోహన్ సింగ్ ని భీష్ముడు తో పోల్చారు.ఈ సినిమా హిందీ లో జనవరి 11 న విడుదల అవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఈ నెల 18 న విడుదల అవుతుంది. ఇంగ్లీష్ లో మాత్రం డేట్స్ ఇంకా విడుదల చేయలేదు. మొత్తానికి ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారని తెలిసింది. 1440 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఈ చిత్ర బృందం చెప్పారు.


Spread the love