పిరమిడ్స్ పై బట్టలు విప్పేసి రచ్చ చేసిన ప్రేమ జంట వీడియో వైరల్

Spread the love

పిరమిడ్స్ పై బట్టలు విప్పేసి రచ్చ చేసిన ప్రేమ జంట వీడియో వైరల్ గా మారింది.. ఎంతో అద్భుతంగా నిర్మించిన 4,500 ఏళ్లనాటి ఈజిఫ్ట్ పిరమిడ్‌పై ఇలా నగ్నంగా తిరిగిన ఈ జంట ఆ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.. ఈజిఫ్ట్ పిరమిడ్‌ లలో ఒకటైన గిజా పిరమిడ్ పై ఈ జంట ఇలా నగ్నంగా తీసిన వీడియో చూసిన నెటిజన్స్ వీళ్లపై మండిపడుతున్నారు.

ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కట్టడం పై ఇలా చేయడం ఏంటని అందరు నోరెళ్లబెడుతున్నారు.. ఈ తతంగం అంతా గతవారం జరిగింది అప్పటినుండి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.. ఈ సంగతి తెలుసుకున్న ఈజిఫ్ట్ అధికారులు ఇది నిజమైన వీడియో కాకపోవచ్చని సమర్ధించుకుంటున్నారు.

పిరమిడ్స్ దగ్గర హై సెక్యూరిటీ ఉంటుందనీ… ఇలాంటి వేషాలు అక్కడ వేసే ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఆండ్రియాస్ కి సొంతంగా వెబ్‌సైట్, ఇన్‌స్టాగ్రాం ఉండటం వల్ల ఈ వీడియో ని పోస్ట్ చేసి ఇలాంటి వీడియో తన గర్ల్ ఫ్రెండ్ తో తీసుకునేందుకు చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టాడు..

ఈ ఘటనపై ఈజిఫ్టు ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది. ఇది నిజమైన వీడియో అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈజిఫ్టు ప్రభుత్వం ప్రకటించింది.


Spread the love