రోబో 2.0 కు సవాల్ విసురుతున్న భైరవగీత

Spread the love

ధనంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారు అయ్యింది.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు , కన్నడ భాషలలో నవంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు..

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా `2.0`. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. `2.0` పాట‌లు, ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇదిలా ఉంటె రోబో 2.0 రిలీజ్ ఐన తర్వాత రోజే రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ‘భైరవగీత’ కూడా విడుదలవుతుంది..అసలే ఈ టైములో రజిని కి పిచ్చ క్రేజ్ ఉంటుంది అలాంటిది ఆ టైం లో ఈ భైరవగీత సినిమాని విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని అందరు ఆలోచనలో పడ్డారట చూద్దాం ఈ భైరవగీత ఎలా తన బలాన్ని చూపిస్తుందో..


Spread the love