ధీవర ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన డైరెక్టర్ బాబీ

Spread the love

తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు.. నిర్మాతలు కూడా ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. సినిమా పేరు ధీవర. నాగసాయి, విదా చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. టైటిల్ కు తగ్గట్టుగానే డైనమిక్ స్క్రిప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ” ధీవర కాన్సెప్ట్ బాగుంది. యూత్ రిలేట్ అయ్యే విధంగా కథ ఉంది. ఆ పోస్టర్ తనకు బాగా నచ్చిందని, ఎంటైర్ యూనిట్ కు ఆల్ ద బెస్ట్ ” చెప్పారు. దర్శకుడు విజయ్ జిక్కి మాట్లాడుతూ “ధీవర సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్ గా ఉంటుందని లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా ఒకేసారి రెండు జానర్స్ లో సాగుతుందని “అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ” కమర్సియల్ అంశాలకు కూడా పెద్ద పీట వేసినట్టు చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియోతో పాటు ట్రైలర్ ను విడుదల చేస్తామని చెబుతున్నారు అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని వచ్చే నెలాఖరు వరకూ ప్రేక్షకుల ముందుకు తెస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు..


Spread the love