యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

Spread the love

మోహన్ బాబు సోషల్ మీడియా లో ప్రముఖుల ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా అభిమానులకు ట్వీట్ చేస్తుంటారు. తాజాగా మోహన్ బాబు యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు , ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అని ఆలోచన రావడమే మాములు విషయం కాదని అలాంటిది ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ప్రశంసనీయమని తెలిపారు.

దివంగత నేత యన్.టి.రామారావు గారు నాకు అన్నయ్య. ఒక తల్లి కడుపులో జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని ఎన్టీఆర్ తనతో అనడం నేను మర్చిపోలేను అని అన్నారు. యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఆడియో ఫంక్షన్‌కు నన్ను పిలిచారు. నేను వెళ్లాను కొన్ని వీడియోలు చూస్తే మళ్లీ అన్నయ్య ఎన్టీఆర్ పుట్టాడా అని కొన్ని కొన్ని సన్నివేశాల్లో అనిపించింది. అంతలా బాలకృష్ణ నటించాడంటే ఇదొక అద్భుతం, అమోఘం. బాలయ్య కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి పోలికలను ఉండడం అనేది కూడా ఒక అద్భుతం అన్నారు.

మహానటుడు ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య తండ్రి చేసినటువంటి పాత్రలను తను నటించడమనేది కూడా మామూలు విషయం కాదు. అదీ కొంచెం కష్టతరమైన పని. అయినా ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా ను స్వయం గా అన్ని బాలయ్యే నిర్మించబడి ఇలా అన్ని కుదరడం మాములు విషయం కాదని బాలకృష్ణ ను ప్రశంసలతో ముంచెత్తారు మోహన్ బాబు. ఈ సినిమా అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అని యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నందమూరి అభిమానులను ఆకట్టుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..


Spread the love