ప్రధానమంత్రి గా వినయ విధేయ రామ’ ప్రతినాయకుడు’

Spread the love

ప్రస్తుతం టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ లలో జీవిత కథల ట్రెండ్ నడుస్తుంది పోటాపోటీగా ప్రముఖుల బయోపిక్ లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తీసిన బయోపిక్ లు విజయాలను అందుకోవడంతో దర్శక నిర్మాతలు బయోపిక్ ల మీద దృష్టి పెట్టారు . తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది అలాగే దివంగత నేత వై ఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’ కూడా షూటింగ్ పూర్తీ చేసుకొని విడుదల కు సిద్దమవుతుంది .

అలాగే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ‘ది ఐరన్‌ లేడీ’ అనే బయోపిక్‌ కూడా తెరకెక్కుతోంది. అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత కథను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది బాలీవుడ్. ఈ బయోపిక్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాత్రలోనటుడు వివేక్ ఒబెరాయ్ ను ఎన్నుకోవడం విశేషం.

తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత కథను ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించబోతున్నారని అయితే ఈ సినిమా కు సంబందించిన ఫస్ట్ లుక్ ను 7 న విడుదల చేయనున్నారని ఒక వారం గ్యాప్ తో సినిమా చిత్రీకరణ కూడా మొదలపెట్టనున్నట్లు తెలిపారు.

ఒమంగ్‌ కుమార్ గతం లో ‘సరబ్‌జీత్‌’,‘మేరీ కోమ్‌’, లాంటి అద్భుతమైన బయోపిక్‌లను తెరకెక్కించిన విజయాలు అందుకున్నాడు, ఇప్పుడు ఒమంగ్‌ కుమార్ దర్శకత్వం వహించబోతున్న
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది .ఈ బయోపిక్‌కు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు విశ్లేషకులు .


Spread the love