పుట్టిన రోజున నిర్మాత చెంప పగులగొట్టిన స్టార్ హీరో

Spread the love

సల్మాన్ ఖాన్ అంటే ఎవరికీ తెలియకుండా ఉండదు. ఫోర్బ్స్ జాబితా లో మన దేశం లో ఆయనదే మొదటి స్తానం. అలాంటి నటనతో పాటు అతనికి ఉన్న కరుణ తో చాల మంది అతనికి అభిమానులు అయ్యారు. సల్మాన్ చాలా మంది అనాధ పిల్లల్ని చేరదీసాడు. ఎన్నో మంచి పనులు సమాజానికి చేసాడు అయితే సల్మాన్ కి ప్రేమతో పాటు ఆవేశం కూడా ఎక్కువే. సల్మాన్ ఈ రోజు తన 53 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు.

తన తండ్రి సలీమ్ ఖాన్ ల సినీ రచయిత కావాలనుకున్న సల్మాన్ కి అనుకోకుండా హీరో ఛాన్స్ వచ్చింది అప్పటి నుండి తాను తన ఉనికిని చాటుకుంటూ వచ్చాడు. తాజాగా ప్రెస్ మీట్ లో తానూ ఒక్క వ్యక్తి ని తప్ప ఇంక ఎవరిని కొట్టలేదని తానూ కూడా తనకి అత్యంత సన్నిహితమైన స్నేహితుడని చెప్పుకొచ్చాడు. తాను చెంప మీద కొట్టిన వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ నిర్మాత సుభాష్‌ఘయ్ అని వెల్లడించారు.

సుభాష్ కి సల్మాన్ కి ఎదో గొడవ జరుగగా సుభాష్ తన కాలర్ పెట్టుకున్నాడని అందుకే తనకి కోపం వచ్చి సుభాష్ ని చెంప మీద కొట్టాడని చెప్పాడు కానీ మరుసటి రోజే సుభాష్ కి సల్మాన్ సారీ చెప్పారని ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మద్య ఎటువంటి గొడవలు లేవని అయన చెప్పుకుంటూ వచ్చారు.


Spread the love