జక్కన్న RRR లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్

Spread the love

జక్కన్న మల్టీస్టారర్‌ గా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.రామ్ చరణ్, తారక్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే..అయితే ఇంతటి స్టార్ క్రేజ్ ఉన్న హీరోలతో చేస్తున్న సినిమా కోసం ఎదో ఒక ప్రత్యేకత ఉండాలని భావించిన జక్కన్న ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరో ని తెర మీదకు తీసుకొచ్చాడు..

అందుకే ఆర్ఆర్ఆర్ లో ఓ హిందీ హీరోను తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు, అజయ్ దేవగన్ అని కూడా వినిపిస్తోంది. అజయ్ దేవగన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దృష్టి వుంది. రోబో 2.0లో శంకర్, రజనీ కలిసినా అక్షయ్ కుమార్ ను విలన్ గా తీసుకున్నారు.

అలాగే ఈ మల్టీస్టారర్‌ లో కూడా ఒక బాలీవుడ్ హీరో ని తీసుకొని ఈ సినిమాకి మరింత బలం చేకూర్చే పనిలో పడ్డాడు రాజమౌళి.. ఇదిలా వుంటే బాహుబలి సినిమాతో రాజమౌళి నేషనల్, ఇంటర్నేషనల్ డైరక్టర్ అయిపోయారు. వందల కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయాలంటే ఇంకా మరింత స్టార్ బలం కావాలి.

అందుకే రాజమౌళి అజయ్ దేవగన్ ని సంప్రదించాడట జక్కన్న తన ఒక్కో సినిమాలో విలన్ లకి ఒక్కో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అలాగే అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న అజయ్ దేవగన్ కి ఈ మల్టీస్టారర్‌ లో ఎలాంటి పాత్ర ఇచ్చిన అజయ్ దేవగన్ కాదనకపోవచ్చని సినీ వర్గాల అభిప్రాయం


Spread the love