రాజకీయాల్లోకి నూతనంగా రంగప్రవేశం చేయబోతున్న నూతన నాయుడు

Spread the love

నూతన్ నాయుడు అంటే అసలు ఇంతకముందు ఎవరికీ తెలిదు. కానీ ఇప్పుడు నూతన్ నాయుడు అనగానే బిగ్ బాస్ నూతన్ అనే అంటున్నారు. బిగ్ బాస్ లోకి కామన్ మాన్ గా వెళ్లిన నూతన్ సెలబ్రిటీ గా తిరిగివచ్చాడు. విచిత్రం ఏమిటి అంటే రెండవసారి బిగ్ బాస్ లోకి అదే సీజన్లో కి ఎంటర్ అవ్వడం.కొంతమంది కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో వచ్చాడని కొంతమంది టెక్నాలజీ నీ వాడుకొని ఫేక్ అకౌంట్ ల ద్వారా వచ్చాడని అంటున్నారు.

బిగ్ బాస్ లో కౌశల్ తో అందరు నెగటివ్ గా ఉన్న ఒక్క నూతన్ మాత్రం తనతో స్నేహంగా ఉండేవాడు. ఎప్పుడు కౌశల్ కి తన సపోర్ట్ ఇస్తూ ఉండేవాడు. బిగ్ బాస్ లో ఒకసారి అందరి ఇష్ట ఇష్టాలు చెప్పమంటే నూతన్ తనకి రాజకీయాలు అంటే ఇష్టం అని తన జీవితాన్ని రాజకీయాల్లో రానివ్వాలని అనుకుంటున్నాడు అని ఒక సారి తెలిపాడు. నూతన్ రెండు సార్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోలేకపోయాడు.

అందరితో పోలిస్తే తన ప్రవర్తన చాల విభిన్నంగా ఉండేది.తాజాగా తానూ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడని తెలిపాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నియోజికవర్గం నుంచి శాసనసభకు గానీ, పార్లమెంటుకు గానీ పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఏదయినా పార్టీ నుండి పోటీ చేస్తాడో లేక ఇండిపెండెంట్ గా చేస్తాడా అనే విషయం ఇంకా తెలుపలేదు. రాజకీయాల్లో గెలవడం అంటే అంత ఈజీ కాదు. రాజకీయాల్లో పలుకుబడి ఉండి ఎన్నో సార్లు గెలిచి తెలంగాణ ఎన్నికల్లో ఓడినవారు ఉన్నారు. అలాంటిది ఎటువంటి రాజకీయా అనుభవం లేని నూతన్ ఎలా రాణిస్తాడా అని చూడాలి.


Spread the love