బెల్లంకొండ, కాజల్ రొమాన్స్ కి డేట్ ఫిక్స్

Spread the love

అల్లుడు శీను తో ఒక మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మరొక థ్రిల్లర్ కథతో మన ముందుకు కవచం రూపంలో వస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ హీరో నటించిన సినిమాల్లన్నిటిలో అగ్ర కథానాయికలు నటించారు అలాగే ఈ కవచం మూవీ లో కూడా కాజల్ అగర్వాల్ మరియు మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తున్నారు.. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాపై మరింత అంచనాలని పెంచేసింది.

ఈ కవచం మూవీ డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..థ్రిల్లర్ సినిమా గా వస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్ మరియు అపూర్వ


Spread the love