యన్ టి ఆర్ కి టైమొచ్చేసింది

Spread the love

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకొని వుంది..ఈ సినిమాకి సంభందించి ఒక్కో ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడల్లా నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు..

ఇప్పటికే బాలకృష్ణ రకరకాల లుక్ లు విడుదల చేసిన డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం అభిమానులకి మరో తీపి కబురుని అందించాడు ఈ సినిమా యొక్క ఆడియో తేదీని ఖరారు చేసినట్టు చిత్ర బృందం తెలియజేసింది ఈ ఆడియో వేడుకని తిరుపతి లో నిర్వహించాలని చిత్ర బృందం తెలియజేసింది ఎన్టీఆర్ కి తిరుపతి సెంటిమెంట్ గా భావించి ఈ వేడుకని అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు ఈ ఆడియో వేడుక తేదీని డిసెంబర్ 3 వ ఆదివారం అంటే డిసెంబర్ 16 వ తేదీన నిర్వహించబోతున్నారు..

డిసెంబర్ నెలలో ఈ ఆడియో వేడుకని నిర్వహించటానికి పెద్ద కారణమే వుంది 1994 సంవత్సరంలో ఎన్టీఆర్ మళ్ళీ అధికారం చేపట్టాడు అందుకు కారణముగా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకొని ఈ వేడుకని అక్కడ నిర్వహిస్తున్నారు..వచ్చే నెలలోనే తెలంగాణా ఎన్నికలు జరాహున్న విషయం తెలిసిందే ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడించాక ఈ వేడుకకి సంభందించిన అతిధుల వివరాలను వెల్లడించనున్నారు ..

ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గా అలరించబోతుంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పాత్రని దగ్గుబాటి రానా పోషిస్తున్నాడు..అలాగే స్వర్గీయ హరికృష్ణ పాత్రని కళ్యాణ్ రామ్ మరియు బసవతారకం పాత్రని విద్యాబాలన్ పోషిస్తున్నారు.. రకుల్ ప్రీత్ శ్రీదేవి గా అలరించబోతుంటే నిత్యామీనన్ మహానటి సావిత్రి పాత్రని పోషిస్తుంది..ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వేడుక కోసం వచ్చే నెల వరకు వేచి చూద్దాం..


Spread the love