దివిసీమ కోసం జోలి పట్టిన బాలయ్య అభిమానుల అభినందనలు

Spread the love

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది ఇప్పటికే మహానటి విడుదలై సంచలన విజయం సాధించింది.. ఇప్పుడు మన టాలీవూడ్ లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో యన్టీఆర్ బయోపిక్ రూపొందుతుంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ సంక్రాంతి బరిలో ఉంచబోతున్నారు.
క్రిష్ ఈ బయోపిక్ ని రెండు పార్టులుగా చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ యన్టీఆర్ కధానాయకుడుని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9 న విడుదల చేసి రెండవ పార్ట్ ని ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..

ఆరోజుల్లో దివిసీమ ఉప్పెన కారణంగా చాలా మంది అమాయకులు నిరాశ్రయులైనారు. దీంతో చలించిపోయిన ఎన్టీఆర్..తన తోటి నటులైన ఏఎన్నాఆర్‌ సహా పలువురు నటులతో కలిసి జోలిపట్టి దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకొని ప్రజలకి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఆ సన్నివేశంలో వచ్చే పాటను ఇపుడు విడుదల చేశారు. ఇపుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది


Spread the love