ఎన్టీఆర్ కోసం సతీసమేతంగా నిమ్మకూరుకి పయనమైన బాలయ్య

Spread the love

స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ ఎప్పుడు ఎప్పుడు విడుదల చేస్తారా అని నందమూరి అభిమానులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయడం మనకు తెలిసిందే. మొదటి భాగం జనవరి 9 న విడుదల కాబోతుంది. రెండవ భాగం ఇంకా పూర్తి కాలేదు, నందమూరి బాలకృష్ణ మరియు ఈ సినిమాలో బసవతారకం పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఇద్దరు కలిసి స్వర్గీయ రామారావు గారి సొంత ఊరు అయిన నిమ్మకూరు గ్రామానికి వెళ్తున్నట్లు సమాచారం అందింది.

అందరు మొదట్లో సినిమా ప్రమోషన్ కి వెళ్తున్నట్లు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం లోని కొన్ని సన్నివేశాలు నిమ్మకూరులో తీయాలని వెళ్తున్నట్లు చెప్తున్నారు. నిమ్మకూరు లోనే ఎందుకు తీస్తున్నారు అని అందరికి అనిపిస్తుంది ఎందుకంటే రామారావు గారికి సంభందించిన ప్రతి విషయాన్ని వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రబృందం చూస్తున్నారు.

ఈ చిత్రం లో చాలా సన్నివేశాలు అలాగే వచ్చాయని క్రిష్ పేర్కొన్నారు. అందుకే నిమ్మకూరు లో ఈ చిత్రాన్ని తీస్తే వాస్తవ రూపం దాలుస్తుంది వీరు నిమ్మకూరు గ్రామానికి వెళ్తున్నారు. ఈ రెండవ భాగం కూడా పూర్తయితే అభిమానులు వాళ్ల అభిమాన హీరోని తెర పై చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 న వుదలవుతుండగా ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నారు


Spread the love