సూపర్‌హీరోస్‌ అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ అఫిషియల్ ట్రైలర్

Spread the love

హాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవెంజర్స్ ట్రైలర్ వచ్చేసింది.. ఇది అవెంజర్స్ కి చివరి పార్ట్ గా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ పేరుతో ఈ ట్రైలర్ ని విడుదల చేశారు.. ముందుగా ఈ ట్రైలర్ ని డిసెంబర్‌ 5న రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది.. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తండ్రి సీనియర్ బుష్ మరణించడం తో ఈ ట్రైలర్ ని రెండు రోజుల పాటు వాయిదా వేసిన తరువాత శుక్రవారం విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చివరి పార్ట్ గా వస్తుంది కాబట్టి ప్త్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.. ఈ ట్రైలర్ లో కెప్టెన్‌ అమెరికా, థోర్‌, బ్లాక్‌ విడో, ఐరన్‌ మ్యాన్‌, హల్క్‌, హాక్‌ఐ లాంటి సూపర్‌ హీరోలు సందడి చేశారు.మరి అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ ఈ చివరి భాగంలో మిగిలిన కెప్టెన్‌ అమెరికా, బ్లాక్‌ విడో, హల్క్‌, ఐరన్‌ మ్యాన్‌కూడా అంతం అవుతారా లేక థానోస్‌ సూపర్‌హీరోస్‌ చేతిలో చనిపోతాడ అన్నదే ఈ సినిమా క్లైమాక్స్‌ కానుంది. ప్రస్తుతం ఈ అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ ట్రైలర్‌ ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ లో ట్రెండ్‌ అవుతోంది.


Spread the love