సైరా లో భాగస్వామి గా మారిన అల్లు అర్జున్

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవి, అమితాబ్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగా స్టార్ చిరంజీవి అద్భుతమైన లుక్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం అప్పుడప్పుడు కొత్త కొత్త లుక్ లు విడుదల చేసి అభిమానులకి ఉత్సాహ పరుస్తున్నారు..

ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ‘స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్’ భాగస్వామి కాబోతున్నాడట. అయితే నటించడం లేదు కానీ బన్నీ గొంతును వాడబోతున్నారని సమాచారం.

ఈ సినిమా వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ వాయిస్ ఓవర్‌ను బన్నీతో చెప్పిస్తారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాకు ప్లస్ అవుతుందని డైరెక్టర్ ‘సురేందర్ రెడ్డి’ భావిస్తున్నట్టు సమాచారం దీనికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది..

ఈ సినిమాలో అమితాబ్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కి గురువుగా చేస్తున్న విషయం తెలిసిందే అమితాబ్ లుక్ చూసి ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది చిత్ర బృందం.. ఎన్నో నిర్మాణ విలువలు కలిగి ఉన్న ఈ సినిమా అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో మన ముందుకు తీసుకు రావడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుంది..


Spread the love