విజయ్ దేవరకొండ ఓవర్ యాక్షన్ అల్లు వారి ఫ్యామిలీ రియాక్షన్

Spread the love

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ప్రత్యేకం అని చెప్పాలి.. ఎందుకంటే తన నటనతో తన అభినయంతో అందరి ప్రసంశలు అందుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి వంటి సినిమాలు తీసి అటు యూత్ ని, ‘గీత గోవిందం’ వంటి సినిమా తీసి ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులని కట్టిపడేసాడు. అలాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ‘నోటా’ తో నిరాశపర్చిన కూడా ప్రస్తుతం విడుదలైన ‘టాక్సీవాలా’ మాత్రం దూసుకుపోతుంది…

విడుదలకి ముందే ఆన్లైన్ లో విడుదలైన ఈ సినిమాపై చిత్ర బృందం ఎంతో భయాందోళనకు గురైంది కానీ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ తో మరియు సినిమా కంటెంట్ తో ఈ సినిమా హిట్ ని సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా ‘టాక్సీవాలా’ మొదటిరోజు హిట్ టాక్ రాగానే ‘టాక్సీవాలా’ టీమ్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ‘టాక్సీవాలా’ టీమ్ తో పాటుగా ‘అల్లు అరవింద్’ కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆనందంలో అల్లు అరవింద్ భుజాల మీద చేయి వేసి నిలబడ్డాడు. ఈ ఫోటో కూడా మీడియాలో బయటకు వచ్చింది.

విజయ్ అలా చేయడం అక్కడ ఉన్న చాలామందికి నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ అంటే టాలీవుడ్ లో ఒక సీనియర్ అని అందరికి తెలుసు అలాంటి వ్యక్తితో విజయ్ అలా చేసేసరికి అల్లు వారి ఫ్యామిలీ విజయ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారట ఇక విజయ్ దేవరకొండ కూడా క్షమాపణలు చెప్పి నా ఉద్దేశం అది కాదు నాకు ఆయన తండ్రితో సమానం అని సర్ది చెప్పుకున్నాడట ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..


Spread the love