ఢిల్లీలో బీజేపీ ఎంపీ కి ఘోర అవమానం : చెప్పు విసిరిన అద్వానీ అభిమాని

Spread the love

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు నేడు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంగా చేదు అనుభవం ఎదురైంది. కాన్పూర్‌కు చెందిన డాక్టర్ శక్తి భార్గవ్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పు విసిరారు. జీవీఎల్‌కు అది దూరంగా పడడం వలన ఆయనకు ఎలాంటి గాయాలుకాలేదు. జీవీఎల్ వెంటనే తల పక్కకు తిప్పుకోవడంతో షూ వెనక్కి వెళ్లి పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడున్నపార్టీ సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు. శక్తి భార్గవ్‌ ఒక వైద్యుడని గుర్తించారు.

అన్నిభద్రత లు ఉండే బీజేపీ ఆఫీసులోకి శక్తి భార్గవ ఎలా ప్రవేశించాడనే విషయంపై చర్యలు మొదలుపెట్టారు. శక్తి భార్గవ్ అద్వానీకి వీరాభిమానిగా చెబుతున్నారు. ఈ విషయం అయన ఫేస్ బుక్ అకౌంట్ లో పెట్టే పోస్ట్ ల ద్వారా తెలిసింది. సోషల్ మీడియాలోఎప్పుడు మోదీ కి వ్యతిరేకంగా పోస్ట్ లు షేర్ చేస్తు ఉంటాడు.అద్వానీ లాంటి సీనియర్ నేతలకు పార్టీలో ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక ఇలా దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు.

ఇదే విధంగా గతం లో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంపై కూడా ఇలాగే చెప్పు వేసిన ఘటనలు చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫై చెప్పు విసిరెయ్యడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.


Spread the love