నాకు ఐటెం సాంగ్స్ లో కనిపించడమే ఇష్టం అంటున్న నటి తమన్నా

Spread the love

తమన్నా ఈ పేరు దక్షిణ సినీ పరిశ్రమ కె కాదు ఉత్తర సినీ పరిశ్రమ కు కూడా బాగా పరిచయం ఆమె అందం అటువంటిది మరి , తమన్నా సన్నిహితులు , అభిమానులు ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుచుకుంటారు .ఆమె అందచందాలతో సినీజనులను ఆకట్టుకున్నారు నటి తమన్నా ,బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సరసన నటించి బాలీవుడ్ లో సైతం మంచి పేరు దక్కించుకుంది బాహుబలి సినిమా తో తమన్నాకు మంచి క్రేజ్ లభించింది . ఎంత పేరు తెచ్చుకున్న తమన్నాకు కష్టాలు తప్పట్లేదు , చేతిలో సరైన సినిమాలు ఉండటంలేదు. ఒకానొక టైం లో తమన్నాకు సినిమాలు దొరకడమే కష్టం అయ్యాయి . అయినా తమన్నా సినీ ప్రపంచం లో ఏదో రూపంలో అభిమానులను అలరిస్తూనే వచ్చింది , అల్లుడు శ్రీను సినిమాలో ఐటెం సాంగ్ చేసి సినిమా లో ప్రేత్యేక ఆకర్షణ గా నిలిచింది ఆ తరువాత ఐటెం సాంగ్స్ చేస్తూనే వచ్చింది జై లవ కుశ సినిమా లో తారక్ సరసన స్వింగ్ జరా సాంగ్ లో ఆమె నృత్యానికి, అందచందాలకు కుర్రకారు మతిపోయిందనే చెప్పాలి . తాజాగా కెజిఎఫ్ లో కూడా అదే తరహాలో ఐటెం సాంగ్ చేసింది మిల్క్ బ్యూటీ .
తమన్నా ఒక మీడియా లో అడిగిన ప్రశ్నకు సినిమాల్లో నాకు డ్యాన్స్ వ‌ల్లే గుర్తింపు వ‌చ్చింది. నాకు డ్యాన్స్ చేయ‌డం చాలా ఇష్టం. ఇప్ప‌టిత‌రం హీరోయిన్ల‌కు డ్యాన్స్‌లో ప్ర‌తిభ‌ను చాటుకునే అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఉండే స్పెష‌ల్ సాంగ్స్ లో న‌టించ‌డానికి నాకు అభ్యంత‌ర‌ముండ‌దు.ఇకముందు కూడా డాన్స్ ప్రధానంగా గా ఐటెం సాంగ్స్ వచ్చిన చేయడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను అంటూ జవాబిచ్చింది …


Spread the love