జక్కన్న కోసం నాని కి నో చెప్పిన కీర్తి

Spread the love

మహానటి తో అద్భుతమైన విజయం అందుకని అందరి ప్రసంశలు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్ ఆ తర్వాత కూడా కీర్తి వరుస విజయాల పరంపర ని కొనసాగిస్తూనే ఉంది ఇక విషయానికొస్తే నాని కీర్తి కలిసి నేను లోకల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే..

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా చేసింది అయితే నాని ఇటీవల చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అయితే ఈ సినిమాలో నాని సరసన నటించడానికి కీర్తి ని సంప్రదించారట చిత్ర బృందం కాని కీర్తి సురేష్ అందుకు అంగీకరించలేదంట నాని కి కీర్తి కి మంచి స్నేహం ఉంది కాని ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాని ఎందుకు తిరస్కరించిందో అని అందరు భావిస్తున్నారు..

అసలు విషయానికొస్తే జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాలో RRRలో నటించడానికి కీర్తి ని సంప్రదించారట ఒకవేళ అదే నిజమైతే డేట్స్ ని సర్దుబాట్లు చేయలేక ఇబ్బంది పడుతుందని నాని తో సినిమాకి నో చెప్పేసిందట రాజమౌళి చేస్తున్న RRR లో కనుక కీర్తి కి అవకాశం వస్తే మాత్రం ఈ మహానటి ఇక తిరులేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి…


Spread the love