శ్రీలంక : 290కి చేరిన మృతుల సంఖ్య..35 మంది విదేశీయులు.. మృతుల్లో ఆరుగురు భారతీయులు

Spread the love

ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. మొత్తం 8 చోట్ల (మూడు చర్చిలు, మూడు హోటళ్లు) బాంబు పేలుళ్లు జరిపారు. కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో అతి దారుణమైన పేలుళ్లు జరిగాయి. ఆ దాడి లో 290 మంది చనిపోగా… 500 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉండగా (వీరంతా చైనా, అమెరికా, బ్రిటన్‌, పోర్చుగీస్‌ ) దేశాలకు చెందిన వాళ్లు, వారిలో ముగ్గురు భారతీయులు వున్నారు.

కొచ్చికడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈస్టర్ రోజున ప్రార్థనల కోసం వచ్చిన భక్తులు మృత్యు వడిలోకి చేరుకున్నారు.. ఒక్క సారిగా పేలుళ్లు జరపడం తో… చెల్లా చెదురుగా పరుగులు తీశారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో తీవ్ర భయానికి గురయ్యారు. ఇప్పటివరకు శ్రీలంక చరిత్రలోనే జరిగిన అత్యంత దారుణ రక్తపాతాల్లో ఇది ఒకటి గా పరిగణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. సోషల్‌ మీడియాను బ్లాక్‌ చేసింది. ఇప్పటివరకు పోలీసులు ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. జహారానా, అబూ మహ్మద్ అనే ఇద్దరు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఉన్నారని సోదాలు చేస్తుండగా కొలంబోకు ఉత్తరంగా ఉన్న ఒరుగొడవట్టలోని ఓ ఇంట్లో పోలీసులు రావడాన్ని గమనినించిన ఆత్మాహుతి దళ సభ్యుడు రెండో అంతస్తులో తనకు తాను పేల్చేసుకున్నాడు. దాంతో, కాంక్రీట్‌ శ్లాబ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. నాలుగు రోజుల ముందే 11 చర్చిలలో బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని శ్రీలంక నిఘా వర్గాలు హెచ్చరించినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.


Spread the love