రోబో 2.0 ని మించిపోతున్న జక్కన్న RRR ఎఫెక్ట్స్

Spread the love

జక్కన్న మల్టీస్టారర్‌ గా తెరకెక్కిస్తున్న చిత్రం.. రామ్ చరణ్ తారక్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే..అయితే ఇంతటి స్టార్ క్రేజ్ ఉన్న హీరోలతో చేస్తున్న సినిమా కోసం ఎదో ఒక ప్రత్యేకత ఉండాలని భావించిన జక్కన్న ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించడానికి 4జి టెక్నాలజీ కెమెరాలని వినియోగిస్తున్నాడట, ఈ మల్టీస్టారర్‌ సినిమాకి ఉపయోగించే టెక్నాలజీ ని ప్రముఖ దర్శకుడు రోబో రూపకర్త డైరెక్టర్ శంకర్ విడుదల చేయబోతున్న రోబో 2.0 కన్నా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉన్న కెమెరాలని ఈ మల్టీస్టారర్‌ లో ఉపయోగిస్తున్నారు..

చెర్రీ, తారక్ మీద తీసే ప్రతి సన్నివేశం మరియు ప్రతి హావభావాల్ని సుమారు 120 కెమెరాలతో బందించనున్నాడు జక్కన్న.ఇలాగే జరిగితే అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు పండగ చేసుకొనే రోజు వచ్చేసినట్టే, ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమాని DVV దానయ్య నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు..

జక్కన్న కూడా అక్కడే ఒక ఇల్లు కట్టుకొని అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడట.. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయికలు ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు.‌ ఈ సినిమా కోసం చరణ్‌, తారక్‌ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సినిమా లీకుల భయం పట్టుకుంది..ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా లీక్ అవ్వకుండా జక్కన్న ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది..

షూటింగ్ సమయంలో ఎవర్ని సెల్ ఫోన్స్ తీసుకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాడట, ఇలాంటి లీకులు జరగకుండా జక్కన్న ముందే చైనా నుండి తెప్పించిన జామర్లు ని ఉపయోగించి ఎటువంటి సెల్ ఫోన్ కి సంభందించిన పరికరాలు పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ఈ మల్టీస్టారర్‌ కోసం రాజమౌళి ఇలా చేస్తున్నందుకు ప్రొడ్యూసర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారు..


Spread the love