మహేష్, సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రంగమ్మత్త

Spread the love

జబర్దస్త్ తరువాత అనసూయ కి అంత పేరు తెచ్చింది రంగ స్థలం చిత్రం లోని రంగమ్మ అత్త పాత్ర. చెప్పాలంటే అనసూయ ఈ పాత్ర లో ఇరగదీసింది అనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వం లో నటించిన రామ్ చరణ్, సమంత, అనసూయ ఆ చిత్రం తో మంచి పేరు తెచ్చుకున్నారు. రంగస్థలం తరువాత రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న వినయ విధేయ రామ లో నటిస్తున్నాడు.

సుకుమార్ మహేష్ కోసం కధ ని రెడీ చేసాడని, మహేష్ కి ఆ కధ ని చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శత్వం లో వస్తున్న మహర్షి చిత్రం లో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల ఏప్రిల్ -5 న విడుదల కానున్నది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాక మహేష్, సుకుమార్ దర్శకత్వం లో చేయబోతున్నాడని టాక్ వచ్చింది.

రంగమ్మ అత్త పాత్రతో అందరిని మెప్పించిన అనసూయ తన నటనతో సుకుమార్ దగ్గర మార్కులు కొట్టేసింది. మహేష్ తో తీయబోయే చిత్రం లో అనసూయ కి మంచి పాత్ర ని ఎంచి పెట్టాడని సినీ వర్గాలు చెప్తున్నాయి.


Spread the love