మరో ప్రయోగానికి సిద్ధపడిన మెగా అల్లుడు

Spread the love

మెగా స్టార్ కుటుంభానికి అల్లుడిగా వచ్చి విజేత సినిమాతో మన ముందుకు హీరో గా పరిచయమైనా హీరో కళ్యాణ్ దేవ్.. ఈ సారి ఈ యువ హీరో మరో కొత్త సినిమాతో మనల్ని అలరించడానికి వస్తున్నాడు.. మొదట తాను నటించిన విజేత సినిమా అంతగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది..

ఆ సినిమాతో నిర్మాత సాయి కొర్రపాటి బాగానే నష్టపోయాడు.. ఆ తర్వాత కొంతకాలం బ్రేక్ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ఇప్పుడు మరో సారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు..నాటకం అనే చిన్న సినిమాను అందించిన రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రెండో ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతోంది. ఈ సినిమాకు హీరోగా కళ్యాణ్ ధేవ్ ను తీసుకున్నారు. పులివాసు దర్శకుడు.

జోనర్, కథ, కమామిషు, హీరోయిన్ వగైరా వ్యవహారాలన్నీ ఇంకా డిసైడ్ చేయాల్సి వుంది. మ్యూజిక్ డైరక్టర్ గా మాత్రం థమన్ ను ఫిక్స్ చేసేసుకున్నారు. త్వరలో అన్నీ డిసైడ్ చేసుకుని, సెట్ మీదకు వెళ్తుందీ సినిమా.


Spread the love