తెలుగులో మ్యాస్ట్రో ఇళయరాజా రణరంగం మొదలైంది

Spread the love

కలతూర్ గ్రామం అనే సినిమాని రణరంగం పేరుతో తెలుగులో విడుదలకి దర్శకుడు శరణ్.కె.అద్వైతన్ అన్ని ఏర్పాట్లని పూర్తి చేశాడు.
ఈ సినిమా తమిళ్ లో ఒక పెద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా తమిళ కథ విషయానికొస్తే తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉన్న పట్చుకొట్టైలోని చిన్న పట్టణం ఆ పట్టణంలో కలతూర్ అనే గ్రామం అదే గ్రామంలో తండ్రి, కొడుకులు నివసిస్తున్నారు. ఏది ఏమయినప్పటికీ వారు 1970 ల నుండి 1990 ల వరకు మొదలుకొని మూడు దీర్ఘ దశాబ్దాలుగా ఒకరితో ఒక వివాదంలో ఉన్నారు. ఇలాంటి కథను ఆధారంగా తీసుకొని డైరెక్టర్ శరణ్. కె. అద్వైతన్ చాల చక్కగా ఈ సినిమాని రూపొందించాడు.

ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.కిషోర్ కుమార్, యగ్నాశెట్టి, సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు..


Spread the love