అమృత వ‌ర్షిణి తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తారకరత్న

Spread the love

నందమూరి తారకరత్న ఎన్నో చిత్రాలలో నటించినా అంతగా గుర్తింపును సంపాదించుకోలేకపోయాడు. రవిబాబు డైరెక్షన్ లో చేసిన అమరావతి అనే చిత్రంలో విభిన్న పాత్రలో నటించి మంచి పేరు సంపాదించినా ఆ తరువాత అంతగా సక్సెస్ కాలేక పోయాడు. చివరగా నారా రోహిత్ తో “రాజా చెయ్యి వేస్తే” అనే చిత్రం లో నటించాడు కానీ ఆ సినిమా కూడా తనకి గుర్తింపును తీసుకురాలేకపోయింది. ఇప్పుడు “అమృత వ‌ర్షిణ” అనే చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తారకరత్న, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకంపై శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్నాడు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో నారా రోహిత్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా, మ‌రో హీరో శ్రీకాంత్ కెమెరా స్విచాన్ చేశారు.

ఈ సినిమాలో అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో థ్రిల్ల‌ర్, ల‌వ్, స‌స్పెన్స్, యాక్ష‌న్‌, సెంటిమెంట్ ఇలా ప్రతి ఒక్క ఎమోష‌న్ ఉంటుంది అని ప్రొడ్యూసర్ తెలియజేశారు. నిర్మాత‌గా తొలి సినిమా ని నిర్మిస్తున్న నాగ‌రాజు నెక్కంటి కి డైరెక్టర్ శివ‌ప్ర‌భు స్నేహితుడు. శివ ప్రభు మాట్లాడుతూ సినిమాని ఎక్కడా రాజి పడకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.

హీరోయిన్ మేఘ‌శ్రీ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను సైకియాట్రిస్ట్ గా న‌టిస్తున్నా ప‌ర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర చేస్తున్నందుకు నాకు చాల సంతోషంగా ఉంది అన్నారు. ఈ నెల 20న షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.


Spread the love